5,000 మంది క్యాబిన్ సిబ్బంది కోసం ఎమిరేట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్
- January 17, 2024
యూఏఈ: దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించింది. 2024లో 5,000 మంది క్యాబిన్ సిబ్బందిని నియమించుకోనుంది. ఎయిర్‌లైన్ ఇంటర్న్‌షిప్‌లు లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగాల అనుభవం, ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఆతిథ్యం లేదా కస్టమర్ సర్వీస్ అనుభవం ఉన్న తాజా గ్రాడ్యుయేట్ల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించింది. ఎమిరేట్స్ క్యాబిన్ సిబ్బంది కోసం ఇంగ్లిష్ భాషలోఆంగ్లంలో నిష్ణాతులు, కనీసం 160cm ఎత్తు, కనీసం 1 సంవత్సరం హాస్పిటాలిటీ లేదా కస్టమర్ సర్వీస్ అనుభవం, కనీస ఉన్నత పాఠశాల (గ్రేడ్ 12) విద్య ఉన్నవారికి ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఇందు కోసం ఎమిరేట్స్ రిక్రూట్మెంట్ బృందం ఆరు ఖండాల్లోని 460 కంటే ఎక్కువ నగరాల్లో ఓపెన్ డేస్ మరియు అసెస్మెంట్లను నిర్వహిస్తుందని ఎమిరేట్స్ తెలిపింది. 2023లో ఎమిరేట్స్ 353 నగరాల్లో రిక్రూట్మెంట్ ఈవెంట్లను నిర్వహించి 8,000 మంది క్యాబిన్ సిబ్బందిని నియమించుకుంది. ప్రస్తుతం ఎయిర్‌లైన్ లో 21,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







