స్థానిక సంస్థల వృద్ధికి జాతీయ ఉత్పత్తి విధానం: ఒమన్
- January 17, 2024
మస్కట్: జాతీయ ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రోత్సహించడం, స్థానిక కంపెనీల వృద్ధికి దోహదపడేందుకు నేషనల్ ప్రొడక్ట్ లాయల్టీ ప్రోగ్రామ్ ను ఒమన్ తీసుకొచ్చింది. పౌరులు, నివాసితులు వారి రోజువారీ వినియోగం కోసం స్థానిక ఉత్పత్తులను ఎంచుకోవడానికి అవకాశాలను ఇది మెరుగుపరుస్తుంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన గణాంకాలు 2023 మూడో త్రైమాసికం చివరి నాటికి ప్రస్తుత ధర ప్రకారం స్థూల దేశీయోత్పత్తి (GDP)లో తయారీ పరిశ్రమల సహకారం 8 శాతంగా ఉందని తెలిపింది. ఒమానీ ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణిక స్పెసిఫికేషన్లతో సహా అనేక కారణాల వల్ల పౌరులు మరియు నివాసితులు జాతీయ ఉత్పత్తులను ఆదరిస్తున్నారని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) వెల్లడించింది. స్థానిక ఉత్పత్తుల కొనుగోలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిస్తుందని, భవిష్యత్తులో వాటి వినియోగాన్ని పెంచుతుందని మంత్రిత్వ శాఖ సూచించింది. జాతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం క్క ప్రాముఖ్యతపై సమాజంలో అవగాహన పెంచడానికి ‘మేడ్ ఇన్ ఒమన్ క్యాంపెయిన్’ దోహదపడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. నేషనల్ ప్రోడక్ట్ లాయల్టీ ప్రోగ్రామ్ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తుందని, మేడ్ ఇన్ ఒమన్ ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రేరేపిస్తుందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) చైర్మన్ ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్ రావాస్ అన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, ఒమానీ కంపెనీలకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలను కూడా అందిస్తోందన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!