హనుమంతుడి కంటే పెద్ద హీరో ఎవరుంటారు.?
- January 17, 2024
సంక్రాంతికి అసలు సిసలు హిట్ సినిమా అంటే ‘హనుమాన్’ సినిమానే.. అనేందుకు సాక్ష్యం ధియేటర్లు హౌస్ ఫుల్ కావడమే.
ఇచ్చినవే కొన్ని ధియేటర్లు.. అన్ని ధియేటర్లూ హౌస్‌ఫుల్ కావడం విశేషం. ఇంతకన్నా ఇంకేముంటుంది.! ‘హనుమాన్’ సినిమాకి టిక్కెట్లు దొరక్క వేరే దారి లేక మిగిలిన సినిమాలకు ప్రేక్షకులు వెళ్లాల్సి వచ్చింది.
ఒక రకంగా చెప్పాలంటే, మిగిలిన సినిమాల్ని ఈ సంక్రాంతి సీజన్‌లో ‘హనుమాన్’ పోషించినట్లే. ధియేటర్లు సరిగ్గా ఇచ్చి వుంటే.. ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించేది. ఇది మాత్రం పక్కా.
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి చెప్పిన మాటలు నిజమయ్యాయ్ ‘హనుమాన్’ విషయంలో. కంటెంట్ బాగుంటే, ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు.. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. హీరోతోనూ సంబంధం లేదు.. అని చిరంజీవి వ్యాఖ్యానించారు. అదే ‘హనుమాన్’ విషయంలో నిజమైంది.
అలాగే, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా మా సినిమాకి హీరో హనుమంతుడే. హనుమంతుడి కన్నా పెద్ద హీరో ఇంకెవరుంటారు అన్నాడు. అది కూడా నిజమే. హనుమంతుడి కన్నా పెద్ద హీరో ఎవరుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి అసలు సిసలు సత్తా వున్న హీరో ‘హనుమాన్’.!
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!