హరీష్ శంకర్ కౌంటర్ ఎటాక్.! ఎవరి కోసం.!

- January 17, 2024 , by Maagulf
హరీష్ శంకర్ కౌంటర్ ఎటాక్.! ఎవరి కోసం.!

వున్నది వున్నట్లు మాట్టాడేయడం.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండడం దర్శకుడు హరీష్ శంకర్‌కి అలవాటు. తాజాగా సోషల్ మీడియాలో హరీష్ శంకర్ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.

ఇండస్ట్రీలో ఎవరినో వుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు సింబాలిక్‌గా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అది ఎవరు.? అనేది మాత్రం తెలియ రావడం లేదు.

ఇక్కడ ఎవరి మీదా ఎవరికీ నెగిటివిటీ వుండదు. ఒకవేళ వున్నా.. అది ఏదో ఒక శుక్రవారం దొరికేస్తుంది. ఎవడన్నా పక్కవాడి అపజయానికి సోలో డాన్స్ వేస్తే.. రేపు వాడి అపజయానికి గ్రూప్ డాన్సర్లు రెడీగా వుంటారు.. గోల్డెన్ వర్డ్స్ ఫ్రమ్ మాస్ రాజా మహారాజా రవితేజ.. అందుకే మీరు ఎంతో హ్యాపీయెస్ట్ పర్సన్.. అంటూ గతంలో రవితేజ చేసిన కామెంట్స్‌ని తాజాగా హరీష్ శంకర్ ట్యాగ్ చేశారు.

అయితే, ఇవి ఎవరిని వుద్దేశించినవో తెలీదు కానీ, ప్రస్తుతం అయితే, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలసిందే. గతంలో ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల కోసం ఈ కాంబినేషన్ వర్క్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మళ్లీ ఈ కాంబో పట్టాలెక్కబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com