అయ్యో పాపం.! ఆ హీరోయిన్‌ని టాలీవుడ్ కలిసి రావడం లేదా.?
- January 17, 2024
తమిళ డబ్బింగ్ మూవీస్‌తోనే ఆ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. తెలుగులో ఇంతవరకూ స్ట్రెయిట్ సినిమా చేయకపోయినా.. టాలీవుడ్ ఆడియన్స్‌కి ఈ ముద్దుగుమ్మ క్రేజీయెస్ట్ హీరోయినే.
ఆమె మరెవరో కాదు, మాళవికా మోహనన్. తెలుగులోనే ఈ మలయాళ కుట్టి కెరీర్ స్టార్ట్ చేయాల్సి వుంది. సెన్సేషనల్ స్టార్ విజయ దేవరకొండతో ‘హీరో’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.
అయితే, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ‘మాస్టర్’, ‘మారన్’ తదితర తమిళ సినిమాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ దక్కించుకుంది. ఇక, ఇప్పుడే మళ్లీ ప్రబాస్ సరసన హీరోయిన్‌గా నటించాల్సి వుంది.
అంతా బాగానే వుంది. ప్రబాస్, మారుతి కాంబో మూవీలో ఈ అందాల భామ హీరోయిన్ అని అప్పుడెప్పుడో ప్రకటించేశారనుకోండి. అయితే, ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఇప్పుడే తెరపైకి వచ్చింది. టైటిల్ అనౌన్స్‌మెంట్ ద్వారా.
టైటిల్ బాగా లేదంటూ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ ఓ వైపు.. మారుతితో సినిమా వద్దంటూ చేస్తున్న రచ్చ ఇంకో వైపు.! అసలు ఈ సినిమా అయినా వచ్చేదేనా.! అంటూ అనుమానాలు మొదలవుతున్నాయ్. అదేంటో.. తమిళంలో వరుసగా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ స్టార్‌డమ్ సంపాదించుకుంటున్న మాళవికకు టాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా సరైనది పడడం లేదెందుకో.!
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!