టాంపాలో హైవే క్లీనింగ్ చేసిన NATS
- January 17, 2024
అమెరికా: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో వినూత్న సేవ కార్యక్రమాన్ని చేపట్టింది. ఫ్లోరిడాలోని టాంపా బే లో నాట్స్ విభాగం మరో ముందడుగు వేసింది. అమెరికాలో రహదారుల పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత కూడా ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావిస్తుంటారు. ఈ బాధ్యతను అక్కడ ఉన్న తెలుగువారికి అలవాటు చేయడానికి.. నాట్స్ నేనుసైతం అంటూ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో నాట్స్ టాంపా బే విభాగం టాంపాలోని ఎస్.ఆర్. 581/బ్రూస్ బీ డౌన్స్ బీఎల్వీడీ రెండు మైళ్ల హైవే ను దత్తత తీసుకుంది. అంటే దత్తత తీసుకున్న రోడ్డు శుభ్రత బాధ్యత నాట్స్ స్వీకరించడం అన్నమాట. దీని ప్రకారం ఈ రెండు మైళ్ల పరిధిలో ఉండే హైవే ను నాట్స్ సభ్యులు శుభ్రపరిచారు. 35 మంది నాట్స్ సభ్యులు, స్థానికంగా ఉండే హైస్కూల్ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో కేవలం పాఠశాల విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల ప్రజలు పాల్గొని నాట్స్ పై ప్రశంసలు కురిపించారు. రెండు మైళ్ల పాటు రహదారికి ఇరువైపులా ఉన్న చెత్త చెదారం అంతా తొలగించారు. అంతా శుభ్రంగా ఉండేలా చేశారు. విద్యార్ధుల్లో కూడా మన పరిసరాలను మనమే బాగు చేసుకోవాలనే స్ఫూర్తిని నింపేందుకు నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమం దోహద పడింది. ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా ధ్రువ పత్రాలను అందించింది. నాట్స్ టాంపా బే నాయకత్వం ఎంతో సమర్థంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ డ్రైవ్ కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా.కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, శ్రీనివాస్ బైరెడ్డి ,అనిల్ ఆరేమండ,, భార్గవ్ మాధవరెడ్డి, ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ రహదారి పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు. భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టాంపా బే నాట్స్ విభాగానికి నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!