ఒమన్ ఫ్యూచర్ ఫండ్‌ను ప్రారంభం: అథారిటీ
- January 18, 2024
మస్కట్: జనవరి 17న OMR 2 బిలియన్ల మూలధనంతో ఒమన్ ఫ్యూచర్ ఫండ్‌ను అధికారికంగా ప్రారంభించినట్లు ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (OIA) ప్రకటించింది. సంవత్సరానికి OMR 400 మిలియన్ల చొప్పున ఐదు సంవత్సరాలలో వీటిని ఖర్చు చేయనున్నారు. వాణిజ్యపరంగా మరియు ఆర్థికంగా లాభదాయకమైన కొత్త లేదా ఇప్పటికే ఉన్న ప్రత్యక్ష పెట్టుబడి ప్రాజెక్ట్‌ల కోసం 90 శాతం పంపిణీ చేసింది. ఫండ్ విదేశీ పెట్టుబడిదారులతో పాటుగా ప్రైవేట్ రంగ సంస్థలు, వ్యాపార యజమానులు, చిన్న మరియు మధ్య తరహా కంపెనీలకు తన సేవలను అందిస్తుంది. పర్యాటకం, పరిశ్రమ - ఉత్పత్తి, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ - కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, పోర్ట్‌లు – లాజిస్టిక్స్, సేవలు, మైనింగ్, ఫిషరీస్ – వ్యవసాయం అనే ఎనిమిది లక్ష్య రంగాలకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఒమన్ ఫ్యూచర్ ఫండ్ స్థాపన లక్ష్య ఆర్థిక రంగాలను పురోగమింపజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్ సలామ్ బిన్ మొహమ్మద్ అల్ మోర్షెది అన్నారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో వెంచర్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. ఒమన్ ఫ్యూచర్ ఫండ్‌లో 10 శాతాన్ని చిన్న -మధ్యతరహా సంస్థలకు కేటాయించడం వల్ల ఆవిష్కరణలు, సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు సాంప్రదాయేతర ఫైనాన్సింగ్‌కు అవకాశం పెరుగుతుందన్నారు చిన్న,మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి అథారిటీ చైర్‌వుమన్ హలీమా బింట్ రషీద్ అల్ జరియా.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!