యూఏఈ విజిట్ వీసా మార్పు: ఒమన్‌కు బస్సులు ఫుల్
- January 18, 2024
యూఏఈ: బస్సులో ఒమన్‌కు ప్రయాణించడం ద్వారా తమ వీసా స్థితిని మార్చుకోవాలని చూస్తున్న యూఏఈ సందర్శకులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పూర్తిగా 'వీసా-మార్పు ప్యాకేజీలు' బుక్ అయినట్లు ట్రావెల్ ఏజెంట్లు చెప్పడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒమన్‌కు బస్సులు గరిష్ట సామర్థ్యంతో నడుస్తున్నాయని, యూఏఈ సందర్శకులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని వారు సూచించారు. విజిట్ వీసా గడువు ముగియడానికి కనీసం పది రోజుల ముందు తప్పనిసరిగా ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తాహిరా టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫిరోజ్ మలియక్కల్ చెప్పారు. రెహాన్ అల్ జజీరా టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ షిహాబ్ పర్వాద్ మాట్లాడుతూ.. ఇంతకుముందు వీసా మార్పుల కోసం సందర్శకులు విమాన సేవలను వినియోగించేవారని, ప్రస్తుతం వాటి ధరలు దాదాపు 20 శాతం పెరిగడంతో బస్సు ప్రయాణాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. బస్ ద్వారా వీసా మార్పులకు ప్యాకేజీ ధర Dh1,000 నుండి Dh1,100 వరకు ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!