మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్.!

- January 18, 2024 , by Maagulf
మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్.!

మెగాస్టార్ చిరంజీవికి ఆ ట్యాగ్ కన్నా మించిన బిరుదు, ఉన్నతమైన గౌరవం ఇంకేముంటుంది.? అనేది చాలా మంది ఆయనను హార్ట్‌ఫుల్‌గా అభిమానించే వారి వుద్దేశ్యం.

అయితే, ఆయన కేవలం ఓ సినిమా హీరో మాత్రమే కాదు. సామాజిక సేవల్లోనూ ఆయన ఉత్తముడే. అందుకే ఉత్తమ సామాజిక సేవల నిమిత్తం ఇచ్చే గౌరవ పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ పురస్కారంతో చిరంజీవిని సత్కరించాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది.

గతంలోనే ఈ పురస్కారం మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వాల్సి వుంది. అయితే, పద్మ భూషణ్ ఇచ్చి సరిపెట్టేశారు. ఇప్పుడు మరోసారి ఇదే చర్చ తెరపైకి వచ్చింది. చిరంజీవికి ఈ సారి పద్మ విభూషణ్ తప్పక ఇవ్వనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతోమందికి సేవలందిస్తున్నారాయన. అలాగే కోవిడ్ టైమ్‌లో బ్లడ్ బ్యాంక్ సేవలతో పాటూ, ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు అందించి సంచలనం సృష్టించారు. ఎంతో మంది కోవిడ్ బాధితుల పాలిట ప్రాణ దాతగా నిలిచారు చిరంజీవి. ఈ కోణంలోనే ఆయనకు పద్మ విభూషణ ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com