‘భైరవకోన’లో సందీప్ కిషన్.! ఈ సారి గట్టిగా కొట్టేలానే వున్నాడు.!

- January 18, 2024 , by Maagulf
‘భైరవకోన’లో సందీప్ కిషన్.! ఈ సారి గట్టిగా కొట్టేలానే వున్నాడు.!

సందీప్ కిషన్ మంచి నటుడు. ఎప్పటి నుంచో హీరోగా కొనసాగుతున్నాడు. కానీ, సరైన హిట్టు లేక రేస్‌లోకి రాలేకపోతున్నాడు. అయితే, ఈ సారి సందీప్ కిషన్ కొట్టేలానే వున్నాడు. గట్టిగా కొట్టేలానే వున్నాడు.

‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా ధియేటర్లలో సందడి చేసేందుకు ముస్తాబవుతోంది.

థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఈ తరహా కాన్సెప్టులతో వచ్చిన సినిమాలకి ఈ మధ్య ప్రేక్షకాదరణ బాగానే దక్కుతోంది. సో, ఈ సినిమాతో సందీప్ కిషన్ హిట్టు కొట్టేలానే కనిపిస్తున్నాడు.

ట్రైలర్ వచ్చాకా సినిమాపై అంచనాలు బాగా పెరిగాయ్. ఇద్దరు ముద్దుగుమ్మలు కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. సినిమా మంచి టాక్ వస్తే.. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా కెరీర్‌లో ఓ మెట్టు పైకెక్కినట్లే అవుతుంది. చూడాలి మరి, ఫిబ్రవరి 9న ఏం జరుగుతుందో. అదే రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com