స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్ ను అందుకున్న అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ

- January 18, 2024 , by Maagulf
స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్ ను అందుకున్న అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సాంకేతిక మరియు వృత్తి విద్యను అనుసంధానం చేయడానికి రాష్ట్రంలో స్కిల్ కాస్కేడింగ్ ఎకో సిస్టమ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్వర్యం లో ఏర్పాటు చేసింది .క్యాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్‌లో ప్రతి నియోజకవర్గం లో ఒక స్కిల్ హబ్, ప్రతి జిల్లా లో స్కిల్ కాలేజీ, అదనంగా పులివెందుల స్కిల్ కాలేజీ, ఇలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్‌లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 26 స్కిల్ కాలేజీ లు ఏర్పాటు చేశారు. 

దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా లోని స్కిల్ హబ్ మరియు స్కిల్ కాలేజీ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అప్పారెల్, కన్స్ట్రక్షన్ , మేనేజ్మెంట్, హెల్త్, మెడికల్ తో పాటుగా వినోద రంగాలలో కూడా శిక్షణలు ఇవ్వటం జరుగుతుంది.

వీటిలో భాగంగా స్కోచ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ  ద్వారా జరిగే కార్యక్రమాలను మరియు మౌలిక సదుపాయలకు,స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్ ను అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఇవ్వటం జరిగింది.

ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్కొచ్ అవార్డ్ ను అందుకోవటం సంస్థ యొక్క పనితీరుకు నిదర్శనం అని ఇదేవిధంగా మున్ముందు సాంకేతికతను  పెంచి మరిన్ని నైపుణ్యాలను అందిస్తామని తెలియచేశారు.

ఎండీ సీఈవో Dr.వినోద్ కుమార్ వీ ఐఏఎస్ మాట్లాడుతూ ఇది ఒక ఆరంభం అని మిగిలిన అన్ని జిల్లా లలో కూడా ఐ.యస్.ఓ (ISO) స్టాండర్డ్ క్వాలిటీ కి అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తామని , రాబోయే రోజులలో ఇంకా మరెన్నో శిక్షణలను ఇచ్చి ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే దిశగా వెళ్తుంది అని అన్నారు.

 
ఈ కార్యక్రమంలో నైపణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, ఎండీ సీఈవో Dr. వినోద్ కుమార్.వీ, ఈడి కె.దినేష్ కుమార్, జనరల్ మేనేజర్ గోపినాధ్, భారతి ,అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి బి. హరికృష్ణ  మరియు సంస్థ యొక్క ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com