గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. 14 మంది విద్యార్థుల మృతి
- January 18, 2024
గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.వడోదరలోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడింది.ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. ప్రమాద సమయంలో పడవలో 27 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే..ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు గురువారం విహారయాత్రకు వచ్చారు. మధ్యాహ్న సమయంలో హర్ని సరస్సులో ఓ పడవలో వెలుతుండగా వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 10 మందికి పైగా విద్యార్థులను కాపాడారు. గల్లంతైన మిగిలిన విద్యార్థుల గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
మరణించిన 14 మందిలో 12 మంది విద్యార్థులు కాగా మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్లు గుజరాత్ రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే మంత్రి ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ప్రమాదానికి బోటు కాంట్రాక్టర్ తప్పిదమే కారణమని అంటున్నారు. బోటులో కెపాసిటీ కంటే ఎక్కువ మంది పిల్లలను ఎక్కించారన్నారు. వారితో పాటు పలువురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారన్నారు. తక్షణమే సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆయన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని వడోదర బయలు దేరారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!