సైబర్ సవాళ్ల పై చర్చించిన అరబ్ ఐటీ మంత్రులు

- January 19, 2024 , by Maagulf
సైబర్ సవాళ్ల పై చర్చించిన అరబ్ ఐటీ మంత్రులు

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుధాబిలో జరిగిన అరబ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ (ATICM) 27వ సమావేశంలో ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఒమన్ ప్రతినిధి బృందానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబారి డాక్టర్ అహ్మద్ హిలాల్ అల్ బుసైది నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఒమన్ చేస్తున్న ప్రయత్నాలను, ముఖ్యంగా డిజిటల్ ఎకానమీ ప్రోగ్రామ్ ఆర్థిక వైవిధ్యీకరణకు చేపట్టిన ప్రభుత్వ విధానాలను వివరించారు. అరబ్ సైబర్‌ సెక్యూరిటీ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోని అప్లికేషన్‌లతో సహా పలు అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణ ఫలితంగా పాలస్తీనా కమ్యూనికేషన్స్ రంగానికి ఎదురవుతున్న సవాళ్లను కూడా ఈ సమావేశంలో చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com