ఆసియా కప్: దోహామెట్రో, లుసైల్ ట్రామ్‌లకు ఫుల్ డిమాండ్
- January 19, 2024
దోహా: జనవరి 12 నుండి జనవరి 16 వరకు జరిగిన 2023 ఆసియా కప్‌లో గ్రూప్ దశలో మొదటి రౌండ్‌లో దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించిన మొత్తం ప్రయాణికుల సంఖ్యను ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) ప్రకటించింది. మెట్రో ద్వారా 1,040,973 మంది ప్రయాణికులు, ట్రామ్ ద్వారా 38,367 మంది ప్రయాణికులు.. మొత్తంగా 1,079,340 మంది ప్రయాణికులకు చేరుకుంది. నెట్‌వర్క్‌లకు అధిక డిమాండ్ ఉందని తెలిపింది. ప్రత్యేకించి టోర్నమెంట్ ప్రారంభ రోజు లుసైల్ స్టేడియంలో ఖతార్ వర్సెస్ లెబనాన్ మ్యాచ్ జరిగింది. ఇది టోర్నమెంట్ మొదటి రోజులో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ నెట్‌వర్క్‌లలో 234,862 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఎక్స్‌పో 2023 దోహా ఎగ్జిబిషన్ జరుగుతున్న సౌక్ వాకిఫ్, లుసైల్ బౌలేవార్డ్, కటారా మరియు అల్ బిడ్డా పార్క్ వంటి ముఖ్య ఈవెంట్ ప్రాంతాలు, ఆకర్షణలకు మెట్రో కనెక్టివిటీని అందించిందని ఖతార్ రైల్‌లోని స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ చీఫ్ అజ్లాన్ ఈద్ అల్ ఎనాజీ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..