రియాద్ వేదికగా ఏప్రిల్‌లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ ప్రత్యేక సమావేశం

- January 19, 2024 , by Maagulf
రియాద్ వేదికగా ఏప్రిల్‌లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ ప్రత్యేక సమావేశం

దావోస్: సౌదీ అరేబియా ఈ ఏప్రిల్‌లో రియాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. గురువారం 'సౌదీ అరేబియా: ది కోర్స్ ఎహెడ్' ప్యానెల్ మీటింగ్ సందర్భంగా సౌదీ ఎకానమీ మరియు ప్లానింగ్ మంత్రి ఫైసల్ అల్ ఇబ్రహీం తెలిపారు.  వివిధ రంగాలకు కేంద్రంగా మరియు ప్రపంచ ఆలోచనా నాయకత్వానికి కేంద్రంగా రియాద్ అభివృద్ధి చెందుతున్నదని ఆయన వివరించారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించడంలో మరియు శక్తి అభివృద్ధి అవసరాలను పరిష్కరించడంలో ఇది ముఖ్యమైనదని WEF అధ్యక్షుడు బోర్గే బ్రెండే వెల్లడించారు. ఏప్రిల్ 28 ,29 తేదీల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం COVID-19 ప్రారంభమైనప్పటి నుండి దావోస్ ఫోరమ్‌ల వెలుపల నిర్వహించే మొదటి ప్రత్యేక WEF సమావేశం కానుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన సౌదీ నాయకత్వానికి బ్రెండే కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com