దుబాయ్ పోలీసుల ట్రాఫిక్ అలెర్ట్

- January 20, 2024 , by Maagulf
దుబాయ్ పోలీసుల ట్రాఫిక్ అలెర్ట్

యూఏఈ: దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం దుబాయ్‌లోని ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. షేక్ జాయెద్ రోడ్డులో డిఫెన్స్ బ్రిడ్జి నుండి ట్రేడ్ సెంటర్ రౌండ్‌అబౌట్ వైపు ఈ సంఘటన జరిగింది. దీని కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో వాహనదారులను హెచ్చరిస్తూ అధికార యంత్రాంగం తన సోషల్ మీడియాలో అకౌంట్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, తమ భద్రతను కాపాడుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com