బాద్షాకి ‘జీరో’ నుంచి ‘హీరో’యిజం.!
- January 20, 2024
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘జీరో’. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటించాడు. అయితే, ఈ సినిమా ఆయనను రియల్ లైఫ్‌లోనూ జీరోని చేసేసింది.
సినిమా ఫ్లాప్ అవ్వడమే కాదు.. ఆ తర్వాత ఏం చేసినా ఏదీ కలిసి రాలేదు బాద్షాకి. దాంతో నాలుగేళ్లు దాదాపు గ్యాప్ తీసేసుకున్నాడు.
ఈ ఏడాది బాద్షాకి పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి. వరుస పెట్టి మూడు సినిమాల్లో నటించాడు. అవే ‘పటాన్’, ‘జవాన్’, డుంకీ’ చిత్రాలు. మూడూ మంచి హిట్స్ అందుకున్నాయ్.
ప్రపంచ వ్యాప్తంగా ‘పటాన్’, ‘జవాన్’ సినిమాలైతే రికార్డు బ్రేకింగ్ వసూళ్లు రాబట్టాయ్. ఇక, ఇదే జోరులో వచ్చే ఏడాదికి మరో మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టబోతున్నాడట షారూఖ్ ఖాన్.
ఈ సారి కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, ప్యాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ ప్రాజెక్టులు సిద్ధం చేసుకోవాలనుకుంటున్నాడట.
ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న షారూఖ్ ఖాన్.. తదుపరి ప్రాజెక్టులు త్వరలోనే అనౌన్స్ చేసే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా మరో మూడింటిని లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడనీ సమాచారం.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!