700 మందితో ప్రారంభమైన ఒమన్ డెసర్ట్ మారథాన్
- January 21, 2024
మస్కట్: 700 మందికి పైగా ప్రపంచ స్థాయి రన్నింగ్ ఛాంపియన్‌ల భాగస్వామ్యంతో “ఒమన్ డెసర్ట్ మారథాన్” తొమ్మిదో ఎడిషన్ నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని బిడియా రాష్ట్రంలో శనివారం ప్రారంభమైంది. ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఇది నాలుగు దశలలో సాగుతుంది. బిడియాలోని విలాయత్‌లోని అల్ వాసిల్ గ్రామం నుండి ప్రారంభమై అల్ షర్కియా యొక్క విస్తారమైన ఇసుక గుండా 165 కి.మీ పాటు సాగుతుంది. మొరాకో, స్పెయిన్, ఫ్రాన్స్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, బ్రిటన్, స్విట్జర్లాండ్ మరియు బెల్జియం వంటి వివిధ ప్రపంచ దేశాల నుండి పోటీదారులు ఇందులో పాల్గొంటున్నారు. నార్త్ అల్ షర్కియా గవర్నర్ మాట్లాడుతూ.. ఉత్తర అల్ షర్కియా వింటర్ ప్రోగ్రామ్ 2024లో మారథాన్ అత్యంత ముఖ్యమైన ఈవెంట్‌లలో ఒకటన్నారు. మారథాన్ పర్యవేక్షకుడు సయీద్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ, మారథాన్ మాట్లాడుతూ.. జనవరి 24 వరకు మొత్తం 165 కి.మీ.లలో మొదటి స్టేజీ 42 కి.మీ, రెండో స్టేజి 55 కి.మీ, మూడో స్టేజ్ 47 కి.మీ, నాలుగో స్టేజ్ 21 కి.మీ.పాటు ఉంటుందన్నారు. రేసు రాత్రిపూట మాత్రమే జరుగుతుందన్నారు. ఈ రేసులు, క్రాస్-కంట్రీ రేస్, హాఫ్ మారథాన్ రేస్ మరియు మారథాన్ రేస్ పేరిట వరుసగా పిల్లలు మరియు కుటుంబాల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







