యూఏఈలో మొదటిసారిగా.. అద్దెప్లాట్ల కోసం వేలం
- January 22, 2024
యూఏఈ: యూఏఈలో మొదటిసారిగా దుబాయ్ ప్రాపర్టీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ అద్దెదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేకమైన వేలం విధానాన్ని అవలంబిస్తోంది. అద్దెదారులు నివసించడానికి భవనాలను ఎంచుకునే సంప్రదాయ పద్ధతికి భిన్నంగా చేపట్టిన ఈ విధానం రియల్ ఎస్టేట్ ల్యాండ్‌స్కేప్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఆల్ఫాబెటా ప్రాపర్టీస్ తన నివాస ప్రాజెక్ట్ M77ను మైడాన్ అవెన్యూలో ప్రారంభించింది. 1, 2 మరియు 3 బెడ్రూమ్లతో కూడిన 77 అపార్ట్మెంట్లను కలిగి ఉన్న ఈ విలాసవంతమైన భవనం డౌన్‌టౌన్ మరియు బుర్జ్ ఖలీఫా వ్యూని అందిస్తుంది. అద్దెలు విస్తీర్ణాన్ని బట్టి Dh105,000 నుండి Dh150,000 -350,000 మధ్య ఉన్నాయి. ఆల్ఫాబెటా ప్రాపర్టీస్‌పై ఆన్లైన్ వేలం జనవరి 21న ప్రారంభమైందని డెవలపర్లు ప్రకటించారు. రెండు వారాల పాటు వేలం కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు నమోదు చేసుకోవాలని, షార్ట్‌లిస్ట్ అనంతరం వ్యక్తిగతంగా ప్లాట్ లను సందర్శించే అవకాశం కల్పిస్తామని ఆల్ఫాబెటా ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడు అల్ షైబానీ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు