ఆధునిక ఒమన్ ను ఆవిష్కరించే.. కల్చరల్ కాంప్లెక్స్ ప్రారంభం
- January 22, 2024
మస్కట్: ఒమన్ కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదివారం ప్రారంభించారు. ఇది ఆధునిక ఒమన్ ను ఆవిష్కరిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందులో మూడు ప్రధాన భవనాలను కలిగి ఉన్నది. ఒమన్ సుల్తానేట్ కళలు మరియు సాంస్కృతిక, ఆధునిక మరియు చారిత్రక భాగాల సేకరణ, పరిరక్షణ మరియు ప్రదర్శన కోసం కేటాయించారు. ఈ కాంప్లెక్స్‌లో నేషనల్ థియేటర్, నేషనల్ లైబ్రరీ మరియు నేషనల్ రికార్డ్స్ అండ్ ఆర్కైవ్స్ అథారిటీ భవనాలు, వీటితోపాటు ఎనిమిది ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. 80,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే వీటిలో భవనాలు 400,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం OMR147.8 మిలియన్లు. ఇది ఒమన్ సాంస్కృతిక, సాహిత్య, రంగస్థల మరియు పరిశోధన కార్యకలాపాలకు నిలయంగా మారనుంది. ఈ కాంపౌండ్‌లో నేషనల్ థియేటర్, నేషనల్ లైబ్రరీ, చిల్డ్రన్స్ పబ్లిక్ లైబ్రరీ, హౌస్ ఆఫ్ ఆర్ట్స్, హౌస్ ఆఫ్ సినిమా, లిటరరీ ఫోరమ్, నేషనల్ రికార్డ్స్ అండ్ ఆర్కైవ్స్ అథారిటీ మరియు గ్యాలరీస్ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్, రెస్టారెంట్లు, ఒక పబ్లిక్ పార్క్ ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు