హెమోగ్లోబిన్ లోపాన్ని సులువుగా గుర్తించడం ఎలా.?
- January 23, 2024
ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా హెమోగ్లోబిన్ లోపం కనిపిస్తుంటుంది. హెమోగ్లోబిన్ లోపం కారణంగా తీవ్రమైన అలసట, నీరసం వేధిస్తుంటాయ్.
అలాగే, చిన్న చిన్న విషయాలకే కోపం రావడం.. చికాకు నిస్సత్తువ వంటి లక్షణాలు చూడొచ్చు. హెమోగ్లోబిన్ లోపాన్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని నిపుణులు చెబుతున్నారు.
తరచూ చేతులూ, కాళ్లు చల్లగా మారడం.. చిన్న చిన్న విషయాలకే భయం.. గుండె దడ, అతివేగంగా గుండె కొట్టుకుంటున్నట్లుగా అనిపించడం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయ్.
ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంటుంది. సఫొకేషన్‌తో బాధపడుతుంటారు. ఎక్కువగా నిలబడినా.. నడిచినా కళ్లు తిరుగుతుంటాయ్.
ఈ లక్షణాలుంటే.. హెమోగ్లోబిన్ సమస్య వున్నట్లు ప్రాధమికంగా గుర్తించొచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుని సంప్రదించాలి.
వైద్యులు సూచించిన మందులు వాడుతూనే డైట్‌లోనూ చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. పాలకూర, క్యారెట్, బీట్ రూట్ వంటివి ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి. బాదం, పిస్తా, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ కూడా అధికంగా తినాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







