‘నేను ప్రతిదీ కోల్పోయాను': Dh200,000 కోల్పోయిన బాధితురాలి ఆవేదన

- January 24, 2024 , by Maagulf
‘నేను ప్రతిదీ కోల్పోయాను\': Dh200,000 కోల్పోయిన బాధితురాలి ఆవేదన

యూఏఈ: పోర్చుగీస్ కు చెందిన ఓ మహిళ గత నాలుగు సంవత్సరాలుగా దుబాయ్ లో ఉంటున్నారు. ఇటీవల తన జీవిత పొదుపు దాదాపు Dh200,000 ఫోన్ స్కామర్‌ల వల్ల కోల్పోయింది. " మోసపోయిన తర్వాత నేను జీవితాన్ని కోల్పోయినట్లు అన్పించింది." అని ఆమె మీడియాతో పేర్కొన్నారు. సాధారణంగా తాను తెలియని నంబర్ నుండి కాల్ తీయనని చెప్పారు. కానీ ఆ సమయంలో తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నానని, అదే కారణంతో ఫోన్ ఎత్తినట్లు తెలిపారు.  Dh150,000 బహుమతిని గెలుచుకున్నట్లు స్కామర్‌లు వివరించడంతో కాల్ ప్రారంభమైందనీ వివరించారు. ఆమె ముందు రోజు సదరు ఎక్స్ఛేంజ్ హౌస్‌ను సందర్శించినందువల్ల వారు ఆమె బ్యాంక్ యాప్‌ని తాజా ENBD X యాప్‌కి అప్‌డేట్ చేయమని చెప్పినట్లు.. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి ఇది అవసరమని భావించింది. ఈ ప్రక్రియలో ఆమె తన లాగిన్ వివరాలను, యాప్ కోసం పాస్‌వర్డ్‌ను స్కామర్లకు తెలిపింది. కానీ ఆ సమయంలో తాను దాదాపు హిప్నోటైజ్ అయినట్లే అనిపించిందని పేర్కొంది. తరువాతి 24 నిమిషాల వ్యవధిలో తన ఖాతా ఖాళీ అయిందని తెలిపారు. తనక డబ్బు పోయిందని గ్రహించే లోపే అంతా అయిపోయింది. ఆపై బ్యాంకుకు..పోలీసు స్టేషన్‌లో  ఫిర్యాదు చేసింది. తన డబ్బు తిరిగి వస్తుందనే ఆశ  లేనప్పటికీ తన కథ ఇతరులకు గుణ పాఠంగా ఉంటుందనీ కోరుకుంటునట్లు ఆమె వివారించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com