ఈ నెల 26న భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం
- January 24, 2024
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న అంశంపై ఈ నెల 26న భారత్ జాగృతి ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ లోని ఖాజా మాన్షన్లో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా ఆయా రాజకీయ పార్టీలను జాగృతి నాయకులు ఆహ్వానించారు.
భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులను జాగృతి నేతలు ఆహ్వానాన్ని అందించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు కూడా పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!









