దుబాయ్‌ ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ని సందర్షించిన హమదాన్‌

- May 31, 2016 , by Maagulf
దుబాయ్‌ ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ని సందర్షించిన  హమదాన్‌



క్రౌన్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ దుబాయ్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, మినిస్టర్‌ ఆఫ్‌ క్యాబినెట్‌ ఎఫైర్స్‌ అండ్‌ ది ఫ్యూచర్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ జెర్గావితో కలిసి దుబాయ్‌ ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ (డిఎల్‌డి) హెడ్‌ క్వార్టర్స్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా హెడ్‌ క్వార్టర్స్‌లోని పలు కార్యాలయాలకు వెళ్ళారు. ఓ ఉద్యోగి, తన విధుల గురించి షేక్‌ హమదాన్‌కి వివరించడం జరిగింది. దుబాయ్‌ ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సుల్తాన్‌ బట్టి బిన్‌ మెర్జాన్‌, దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌కి ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ అందిస్తున్న సర్వీసుల గురించి ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. మ్యూజియంలో పొందు పరచబడ్డ ఓల్డ్‌ రికార్డ్స్‌, ప్రాపర్టీ డీడ్స్‌, ఇతర ముఖ్యమైన పత్రాల గురించి వివరించడమే కాకుండా, రియల్‌ ఎస్టేట్‌ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి స్మార్ట్‌ సిస్టమ్‌ యొక్క వివరాల్నీ విపులీకరించారు. సిబ్బంది తమ విధుల్ని సక్రమంగా నిర్వహించాలని కోరుతూ, వారి అంకిత భావం పట్ల హర్షం వ్యక్తం చేశారు షేక్‌ హమదాన్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com