సమంత వదిలేసింది.! వాళ్లు పట్టుకున్నారు.!
- January 25, 2024నేషనల్ క్రష్ రష్మిక మండన్నాఓ ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘రెయిన్ బో’ సినిమా. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్గా సమంతను అనుకున్నారట.
కానీ, రష్మికతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. అలాగే, ఇప్పుడు మరో సినిమా కూడా సమంత చేయాల్సింది శృతి హాసన్ చేతికొచ్చిందని సమాచారం. సినిమా ఏంటీ.? కథ, కాకరకాయ్ వంటి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
కానీ, ఆ ప్రాజెక్ట్‌ని సమంత కోసమే సిద్ధం చేశారట. కానీ, ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా వుంటూ, కేవలం సోసల్ మీడియాకే పరిమితమైన సంగతి తెలిసిందే.
ఈ కారణంగానే ఆమె చేయాల్సిన సినిమాలన్నీ ఇలా వాళ్లూ వీళ్లూ ఎగరేసుకుని వెళ్లిపోతున్నారు. అలాగే మొన్నా మధ్య ఓ వెబ్ సిరీస్‌లోనూ సమంత నటించింది. కానీ, ఆ సిరీస్ పరిస్థితేంటో ఇంతవరకూ తెలీదు.
అదే సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. కానీ, సమంత నటించిన వెర్షన్ కనీసం అప్డేట్ కూడా లేదు. ఇదిలాగే కొనసాగితే.. సమంతను ముందు ముందు ఆడియన్స్ మర్చిపోయేలా వున్నారు. అంతేకాదు, ఇకపై సమంత నటిగా కొనసాగుతుందా.? లేదా.? అనే అయోమయంలోనూ ఆమె ఫ్యాన్స్ కొందరు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు