గుండె వేగంగా కొట్టుకోవడం దేనికి సంకేతం.?
- January 25, 2024చలికాలంలో కొందరికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయితే ఇది సాధారణ సమస్యనేనా.? లేదంటే ఏదైనా అనారోగ్యానికి దారి తీస్తుందా.? అంటే.. కొందరిలో ఒత్తిడి, టెన్షన్.. రకరకాల కారణాల వల్ల రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి.. బీపీ పెరుగుతుంది.
తద్వారా గుండె వేగం కూడా పెరుగుతుంది. సాధారణంగా అయితే, దీన్ని ఒక మానసిక సమస్యగా పరిగణిస్తారు. కానీ దీర్ఘ కాలం పాటు ఇదే సమస్య కొనసాగితే మాత్రం వైద్యుని సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల కూడా రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దాంతో బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. అప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అయితే, హార్ట్ బీట్ పెరగడం అనేది కొన్నిసార్లు గుండెకి సంబంధించిన సమస్య కాదు.. మెదడుకు సంబంధించిన సమస్యగా కూడా పరిగణిస్తారు.
ఇలాంటప్పుడు మెదడును కూల్ చేసేలా పనులు చేయాలి. వీలైతే వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. లేదంటే ఇష్టమైన వ్యక్తులతో మాట్టాడడం చేయాలి.
తద్వారా కొంత మనసు తేలీక పడుతుంది. మొక్కలు పెంచడం, ప్రశాంతమైన వాతావరణంలో నచ్చిన పనిని చేసుకోవడం వంటివి చేసినా కాస్త ఊరట లభిస్తుంది. సరదాగా వంట చేయడం.. లేదంటే, ఏదైనా ఆహ్లాదమైన వస్తువులతో టైమ్ పాస్ చేయడం వంటివి కూడా ఈ సమస్యకు ఊరటనిస్తాయని నిపుణులు సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్