తడిసి ముద్దైన హైదరాబాద్

- May 31, 2016 , by Maagulf
తడిసి ముద్దైన హైదరాబాద్

నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఈ రోజు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.జంట నగరాలతో పాటు శివారు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు ఇబ్బందిపడ్డారు. కాగా ఈ వర్షంతో వేడి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com