రియాద్ సీజన్ 2023: 15 మిలియన్లతో కొత్త రికార్డు!
- January 27, 2024
రియాద్: 2023 రియాద్ సీజన్ ప్రస్తుత ఎడిషన్ సందర్శకుల సంఖ్య రికార్డు సృష్టించిందని సౌదీ జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) తెలిపింది. GEA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ టర్కీ అల్-షేక్ బుధవారం ఈ సీజన్ కార్యకలాపాలను వెల్లడించారు. ప్రపంచం నలుమూలల నుండి 15 మిలియన్లకు పైగా సందర్శకులు వచ్చారని, దీంతో రియాద్ ఈ సీజన్ ఈ రికార్డును సాధించిందని వివరించారు. అక్టోబర్ 2023లో ప్రారంభమైన రియాద్ సీజన్ 4వ ఎడిషన్.. 2021లో రెండవ ఎడిషన్‌లో సాధించిన 15 మిలియన్ల మంది సందర్శకుల సంఖ్యను దాటి రికార్డును సాధించిందన్నారు. రాబోయే వారాల్లో అనేక పెద్ద ఈవెంట్లు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రియాద్ సీజన్ కప్ ఛాంపియన్షిప్, రియాద్ సీజన్ స్నూకర్ ఛాంపియన్షిప్ (ఇంగ్లీష్ బిలియర్డ్స్) యొక్క మొదటి ఎడిషన్ “రియాద్ సీజన్ బాల్,” UFC మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ షిప్ ( 5v5), చారిత్రాత్మక బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఉన్నాయని తెలిపారు. 2019లో రియాద్ సీజన్ మొదటి ఎడిషన్‌కు సందర్శకుల సంఖ్య 9.6 మిలియన్లకు చేరుకోగా.. 2022లో మూడో ఎడిషన్‌కు సందర్శకుల సంఖ్య 13 మిలియన్లకు చేరిందన్నారు.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్‌తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









