‘కంగువ’ నుంచి బాబీ డియోల్ ఫస్ట్ లుక్.!
- January 27, 2024
సూర్య ప్రధాన పాత్రలో వస్తున్న ‘కంగువ’ సినిమా నుంచి కీలక పాత్రధారి అయిన బాబీ డియోల్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య పాత్ర చిత్రీకరణ కూడా భిన్నంగా రూపొందిచబడింది. సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
కథా, కమామిషు ఏంటనే విషయంపై క్లారిటీ లేదు కానీ, ఓ ప్రయోగాత్మక పీరియాడికల్ మూవీగా ‘కంగువ’ను అభివర్ణిస్తున్నారు.
తాజాగా రిలీజైన బాబీ డియోల్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్రమైన వేషధారణలో వున్న వ్యక్తులు.. వారిలో మహిళలు కూడా వున్నారు. ఓ గుంపులా వున్న ఆ వ్యక్తుల మధ్య మరింత చిత్రమైన గెటప్‌లో బాబీ డియోల్ కనిపిస్తున్నారు.
ఈ మధ్య ‘యానిమల్’ చిత్రంతో బాబీ డియోల్ స్పెషల్ ట్రెండింగ్‌గా నిలిచారు. అలాగే, తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హరవీరమల్లు’లోనూ ఔరంగజేబు పాత్రలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాడు బాబీ డియోల్. ‘కంగువ’ కోసం ఎలాంటి పర్‌ఫామెన్స్ ఇవ్వబోతున్నారో చూడాలి మరి.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









