మతాఫ్‌లో పిల్లల స్ట్రోలర్‌లకు అనుమతి లేదు

- January 31, 2024 , by Maagulf
మతాఫ్‌లో పిల్లల స్ట్రోలర్‌లకు అనుమతి లేదు

మక్కా: గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు వ్యవహారాల సంరక్షణ కోసం జనరల్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది.  పిల్లల స్ట్రోలర్‌లు మతాఫ్ (పవిత్ర కాబా చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రాంతం) గ్రౌండ్ ఫ్లోర్‌లోకి తీసుకురావడానికి అనుమతించరు. మక్కాలోని గ్రాండ్ మసీదు లోపల పిల్లల స్ట్రోలర్‌లను తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రాంతాలు ఉన్నాయని అథారిటీ ప్రకటించింది. గ్రాండ్ మసీదు లోపలికి పిల్లల స్ట్రోలర్‌లను తీసుకురావడానికి మతాఫ్‌లోని పై అంతస్తులు, అలాగే మసా (సఫా మరియు మార్వా మధ్య నడిచే ప్రాంతం) ఉన్నాయని తెలిపింది. ఇక్కడ కింగ్ ఫహద్ విస్తరణ ప్రాంతం గుండా స్ట్రోలర్‌ల ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. మతాఫ్ మరియు మసా అంతస్తుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటే పిల్లల స్ట్రోలర్లు కూడా పవిత్ర మసీదులోకి ప్రవేశించడం నిషేధించబడుతుందని అధికార యంత్రాంగం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com