కొత్త పార్లమెంటులో తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపదీ మూర్ము ప్రసంగం

- January 31, 2024 , by Maagulf
కొత్త పార్లమెంటులో తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపదీ మూర్ము ప్రసంగం

న్యూ ఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ మూర్ము ప్రసంగించారు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారిగా ప్రసంగించిన రాష్ట్రపతి.. దేశ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలు, నిర్ణయాలు, రంగాల వారిగా సాధించిన వృద్ధి, ప్రగతిని ప్రసంగంలో ప్రస్తావించారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైందని పేర్కొన్నారు. జీ20 సమావేశాలను భారత్‌ విజయవంతంగా నిర్వహించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు.

రాష్ట్రపతికి ఘన స్వాగతం
అంతకుముందు సెంఘోల్ తో పాటు నూతన పార్లమెంట్ భవనంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. ఎంపీలు కరతాళ ధ్వనులతో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నంతసేపు ప్రధాని నరేంద్ర మోదీతో సహా అధికారపక్ష సభ్యులు అందరూ బల్లలు చరుస్తూ హర్షద్వానాలు చేశారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
శాంతినికేతన్‌ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.
భగవాన్‌ బిర్సాముండా జన్మదినాన్ని జన్‌ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నాం.
ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం.

చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ రికార్డు.
ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను భారత్‌ దిగ్విజయంగా ప్రయోగించింది.
భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్‌-1 ప్రవేశించింది.
జీ20 సమావేశాలను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది.

ఆసియా క్రీడల్లో భారత్‌ తొలిసారిగా 107 పతకాలు సాధించింది.
ఆసియా పారా క్రీడల్లో భారత్‌ 111 పతకాలు సాధించింది.
భారత్‌లో తొలిసారిగా నమోభారత్‌ రైలును ఆవిష్కరించాం.

నారీశక్తి వందన్‌ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లభించింది.
పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోంది.
తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశాం.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించాం.
ఎన్నో ఏళ్ల భారతీయుల కల రామమందిర నిర్మాణం సాకారమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com