వరుణ్ తేజ్ సినిమా వాయిదా.! కారణమిందే.!
- February 01, 2024
మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ ఓ ఇంటివాడయ్యాకా వరుసగా రెండు ప్రాజెక్టులు సెట్స్ మీదికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘ఆపరేషన్ వాలైంటైన్’. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.
తెలుగులో మొట్ట మొదటి ఎయిర్ ఫోర్స్ విజువల్ వండర్ సినిమాగా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారు. కొత్త దర్శకుడు సరికొత్తగా ఈ సినిమాని తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
కాగా, ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, వాయిదా పడినట్లుగా తాజా సమాచారం అందుతోంది. అందుకు కారణం ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ వుండిపోయిందట.
ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందబోయే సినిమా కాబట్టి.. భారీ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. ఆ క్రమంలోనే ఇంకా వర్క్ పెండింగ్ వుండడంతో.. సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ఇంకా రిపోర్ట్ రాలేదు చూడాలి మరి. బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్‌తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









