రమదాన్ గ్రాంట్ విడుదలకు కింగ్ ఆదేశాలు
- June 01, 2016
కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, రాయల్ ఆర్డర్‌ని జారీ చేశారు. రమదాన్ బహుమతుల కోసం నిర్దేశించిన మొత్తాన్ని రాయల్ ఛారిటీ ఆర్గనైజేషన్ (ఆర్సిఓ) స్పాన్సర్డ్ కుటుంబాలకు అందించేలా ఈ ఆదేశాల్లో కింగ్ పేర్కొన్నారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా లబ్దిదారులకు బహుమతులు అందనున్నాయి. 10,000 బహ్రెయినీ దినార్స్ విలువైన బహుమతులు ఆర్సిఓ రిజిస్టర్డ్ అనాధలు, వితంతువులకు దక్కనున్నాయి. ఆర్సిఓ సెక్రెటరీ జనరల్ డాక్టర్ ముస్తఫా అల్సయెద్ మాట్లాడుతూ, రాయల్ గ్రాంట్, కింగ్ హమాద్‌కి పౌరుల మీదున్న ప్రేమాభిమానాలకు నిదర్శనమని చెప్పారు. ఈ గ్రాంట్‌తో లబ్దిదారులు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపగలుగుతారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







