144సెక్షన్

- June 01, 2016 , by Maagulf

 

అలజడి

తర్వాత
నిశ్శబ్దంలా...
నగరం రోడ్లు
కుబుసం వదుల్తున్న
పాముల్లా...
ఒక
ఘటన
సంఘటన
నడుమ
నగరం
రోడ్లు
నిద్రపోవు
పోనివ్వవు
బతుకుకు
వెళ్ళిన
వాళ్ళకోసం
ఇంట్లో
వాళ్ళు
కిటికి చువ్వలకు
వేళ్ళాడేసిన
చూపుల్లా...

ఈ అంతరంలో
వార్తల్లో
విరామంలా
నిర్జీవ
రోడ్లు
కొత్త
దుస్తులు
వేసుకుంటాయి

 

--సత్య శ్రీనివాస్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com