వాహనదారులకు అలర్ట్..

- February 03, 2024 , by Maagulf
వాహనదారులకు అలర్ట్..

న్యూ ఢిల్లీ: వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇటీవల ఫాస్టాగ్ లో నో యువర్ కస్టమర్(కేవైసీ)ని అప్ డేట్ చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.

అయితే వాహనదారులకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు జనవరి 31 వరకు గడువు విధించింది ఎన్ హెచ్ఏఐ. అయితే ఇంకా కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్ లో కేవైసీని అప్ డేట్ చేసుకోకపోవడంతో వారికి మరో అవకాశం కల్పించింది. తాజాగా ఫాస్టాగ్ కేవైసీ గడువు తేదీని పెంచింది ఎన్ హెచ్ఏఐ. ఫిబ్రవరి 29వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వాహనదారులు వెంటనే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్ హెచ్ఏఐ కోరింది.

నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు టోల్ ఫీ చెల్లించడం తప్పనిసరి. ఈ క్రమంలో కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని ఫాస్టాగ్ ఖాతాలను తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ వాటిని డీయాక్టివేట్ చేసి బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఎన్ హెచ్ఏఐ గుడ్ న్యూస్ తెలుపుతూ గడువును పెంచింది. ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్నుల చెల్లింపును సులభతరం చేస్తుంది. ఇది సదరు వాహన ఫాస్టాగ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా టోల్ మొత్తాన్ని కట్ చేస్తుంది. తద్వారా నిమిషాలతరబడి టోల్ గేట్‌ల వద్ద వేచిచూడకుండా ఉండేందుకు వీలు కలుగుతుంది.

సమయం కూడా ఆదా అవుతుంది. ఒకే వాహనం ఒకే ఫాస్టాగ్‌ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ హెచ్ఏఐ తెలిపింది. ఒకే వాహనానికి ఒకటికి మించి ఫాస్టాగ్‌లు వినియోగించడం లేదా ఒకే ఫాస్టాగ్‌ను వివిధ వాహనాలకు వినియోగిస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ దృష్టికి వచ్చింది. అలాగే కొన్ని సందర్భాల్లో కేవైసీ పూర్తి చేయకుండానే ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ఫాస్టాగ్ కేవైసీ తప్పనిసరి చేసినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com