ఇండో-మలేషియా ఫిల్మ్ ఎక్స్ చేంజ్ నిర్వహించిన ఎఫ్.టి.పీ.సి ఇండియా

- February 03, 2024 , by Maagulf
ఇండో-మలేషియా ఫిల్మ్ ఎక్స్ చేంజ్ నిర్వహించిన ఎఫ్.టి.పీ.సి ఇండియా

కౌలాలంపూర్: బాహుబలి, పుష్ప, సలార్ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా అంటే మలేషియన్ వాసులు అమితాసక్తిని కనబరుస్తున్నారని, ముఖ్యంగా మన పాటలు వారు స్పష్టంగా పడుతుండటం చూసి ఎంతో ఆనందం కలిగిందని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు జంగా చైతన్య, విజయ్ వర్మ పాకలపాటి హర్షం వ్యక్తం చేశారు. సినీ సాంకేతికత, నైపుణ్యం మరియు టూరిజం వంటివి ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించుటయే లక్యంగా ఇప్పటికే నేపాల్, శ్రీలంక దేశాలలో కార్యక్రమాలు నిర్వహించిన ఎఫ్.టి.పి.సి ఈ వారంలో మలేషియా లోని కౌలాలంపూర్ లో ఇండో-మలేషియా  ఫిలిం అండ్ టూరిజం ఎక్స్చేంజి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి ఇండియాలో వున్న సినీ సాంకేతిక నిపుణత మరియు లొకేషన్స్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది. అలాగే మలేషియాలో వున్న లొకేషన్స్ మరియు సాంకేతిక నిపుణులతో అవగాహన కుదుర్చుకొంది. తద్వారా మన చిత్రాలు సులభంగా అక్కడ షూటింగ్ చేసుకొనే వీలుందని ఎఫ్ టి పీ సి సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com