వాకింగ్‌తో మెదడుకు మసాజ్.!
- February 07, 2024
అదేంటీ.! వాకింగ్‌తో మెదడుకు మసాజ్ ఎలా అవుతుంది.. అని ఆశ్చర్యపోతున్నారా.? అవునండీ.. ప్రతీరోజూ వాకింగ్ చేయడం వల్ల బుర్ర సరిగ్గా పని చేస్తుందట.
అదేనండీ.. మెదడు సరిగ్గా పని చేస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం పేరు చెప్పి అనేక రకాల వర్కవుట్లు చేసి కష్టపడిపోతుంటారు చాలా మంది.
కానీ, అన్నింట్లోకెళ్లా వాకింగ్ బెస్ట్ ఎక్సర్సైజ్ అంటున్నారు నిపుణులు. ప్రతీరోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అది కూడా రోజులో 4000 అడుగులు వేయడం వల్ల వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా అరుదు అని చెబుతున్నారు.
అందుకు కారణం వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్ని ఎక్కువగా గ్రహిస్తుంది. అలా గ్రహించిన ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరి, రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.
అలాగే, ఊపిరితిత్తుల్లోని అనవసరమైన ట్యాక్సిన్లు, వ్యర్ధాలను బయటికి పంపించేందుకు తోడ్పడుతుంది. రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల గుండె పోటుకు ఆస్కారం వుండదు. అలాగే, రక్త ప్రసరణ సక్రమంగా వుండడం వల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది.
తద్వారా మెదడుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా మతి మరుపు సమస్య దరి చేరదని తాజా సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







