విశ్వక్సేన్ ‘గామి’ ముందుకొచ్చింది కానీ,!
- February 08, 2024
యూత్‌లో మంచి క్రేజ్ వున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘గామి’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెరీ లెటెస్ట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.
మార్చి 8న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సంసిద్ధమవుతున్నారు. వాస్తవానికి విశ్వక్సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం రిలీజ్‌కి సిద్ధం కావల్సి వుంది.
మొన్నీ మధ్యనే ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యింది. కానీ, ఆ సినిమాకి ఇంకా స్లాట్ దొరకలేదు. కానీ, అప్పుడెప్పుడో పూర్తయ్యి.. అస్సలు సోదిలోనే లేని ‘గామి’ సినిమా రిలీజ్‌కి ముందుకొచ్చింది.
ఈ సినిమాలో విశ్వక్సేన్ స్టన్నింగ్ రోల్లో కనిపించబోతున్నాడు. అది ఓ అఘోరా పాత్రనీ ప్రచారం జరుగుతోంది. సినిమా కథా, కమామిషు కూడా సరికొత్తగా వుండబోతోందనీ తెలుస్తోంది. చూడాలి మరి, అనుకోకుండానే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘గామి’తో విశ్వక్సేన్ చేయబోయే మ్యాజిక్ ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









