దుబాయ్ ఫేక్ ప్రాపర్టీ యాడ్ స్కామ్.. నివాసితులకు అలెర్ట్

- February 10, 2024 , by Maagulf
దుబాయ్ ఫేక్ ప్రాపర్టీ యాడ్ స్కామ్.. నివాసితులకు అలెర్ట్

యూఏఈ: రియల్ ఎస్టేట్ ప్రకటనలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులను పాటించడంలో విఫలమైన 30 రియల్ ఎస్టేట్ కంపెనీలపై దుబాయ్ రెగ్యులేటరీ అథారిటీ చర్యలు తీసుకుంది.  ఒక్కొక్క కంపెనీకి Dh50,000 జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రాపర్టీ నకిలీ ఫోటోలతో  అద్దెదారులను ఆకర్షించే ప్రకటనల పట్ల అలెర్ట్ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో ఈ పోస్ట్‌ల ద్వారా చాలా మంది దుబాయ్ నివాసితులు మోసపోయారని, కొందరు అడ్వాన్స్ కూడా చెల్లించారని తెలిపింది. జోర్డాన్ జాతీయుడైన మొహమ్మద్ నేల్ మాట్లాడుతూ “నేను ఆన్‌లైన్‌లో చూసిన గది నాకు చాలా నచ్చింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ నాకు రెండు ఆస్తులను చూపించినప్పుడు, అతను ఫోటో పోస్ట్ చేసిన దాన్ని నేను చూడగలనా అని అడిగాను. ఇప్పుడు అందుబాటులో లేదని చెప్పాడు” అని మహమ్మద్ చెప్పాడు. ఇతర ఏజెంట్ల ద్వారా ఇలాంటి జాబితాలు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురైన అతను ఆన్‌లైన్‌లో ఇతర ప్రాపర్టీలను తనిఖీ చేసి, చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్న ఫ్లాట్‌ల ఫోటోలను పోస్ట్ చేస్తున్నారని, కానీ వాస్తవానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని గుర్తించారు.రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ (రెరా), దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ (DLD) యొక్క రెగ్యులేటరీ విభాగం, ప్రకటనలను నియంత్రించడానికి మరియు పరిశ్రమలోని ప్రతికూల పద్ధతులను అరికట్టడానికి నిబంధనలు మరియు షరతులను ఏర్పాటు చేసింది.రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోని అన్ని కంపెనీలను అడ్వర్టైజ్‌మెంట్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని మరియు అడ్వర్టైజింగ్ లైసెన్స్‌లను పొందడం ద్వారా కస్టమర్‌లకు ఖచ్చితమైన మరియు సరైన సమాచారాన్ని అందించాలని అధికార యంత్రాంగం సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com