అనసూయ సినిమాకి అప్పుడే రీమేకులా.?
- February 10, 2024
ఒక సినిమా ఫార్ములా హిట్ అయ్యిందంటే చాలు.. అదే ఫార్మేట్లో మరికొన్ని సినిమాలొస్తుంటాయ్. అలాగే, ఇప్పుడు ఒక భాషలో హిట్ అయిన సినిమాని వేర్వేరు భాషల్లో రీమేక్ చేస్తుండడం ట్రెండ్ అయ్యింది.
అయితే, ‘అరి’ అనే సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే రీమేక్‌ల హంగామా మొదలైంది. వినోద్ వర్మ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించింది.
తీర్చుకోలేని బలమైన కోరికలతో వున్న మనుషుల్ని గుర్తించి వారి కోరికలు తీరుస్తుంటాడు వినోద్ వర్మ ఈ సినిమాలో. అందుకోసం పలు అక్రమ కార్యకలాపాలు చేయిస్తుంటాడు ఆయా వ్యక్తులతో.
అలా వాళ్లు లైఫ్‌లో ఎలాంటి క్రిటికల్ సిట్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.? అసలెందుకు ఇలాంటి ఓ మార్గాన్ని ఎంచుకున్నాడు వినోద్ వర్మ.? అనేదే ఈ సినిమా కథ.
ట్రైలర్‌తో సహా కొన్ని ప్రచార చిత్రాలు రిలీజైన ఈ సినిమాని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రిలీజ్ కాకుండానే రీమేక్స్‌కి సిద్ధమైన ఈ సినిమా అందుకే హాట్ టాపిక్ అయ్యింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







