రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడానికి గుండె పోటుకీ సంబంధం ఏంటీ.?

- February 15, 2024 , by Maagulf
రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడానికి గుండె పోటుకీ సంబంధం ఏంటీ.?

సరిగ్గా బ్రష్ చేయకపోతే గుండె పోటు వస్తుందా.? అదేంటీ.! బాగా బ్రష్ చేసుకోకపోతే.. పళ్లే కదా పుచ్చిపోతాయ్. లేదంటే నోటి దుర్వాసన వస్తుంది. చిగురు వాపులు గట్రా దంత సమస్యలు మాత్రమే వస్తాయ్. కానీ, గుండె పోటు రావడమేంటీ.?  అనుకుంటున్నారా.?

అవునండీ తాజా అధ్యయనాల్లో ఈ ఆశ్చర్యకరమైన విషయం తేలింది. సరిగ్గా బ్రష్ చేయని వారికి అది కూడా రోజుకు రెండు సార్లు పళ్లు తోముకునే అలవాటు లేని వాళ్లకి గుండె పోటు వచ్చే అవకాశాలున్నాయట. అందుకు కారణం.. మనం తినే ఆహారం నోటి ద్వారానే శరీరంలోకి వెళుతుంది.

నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మొత్తం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లే. నోటిని శుభ్రంగా వుంచుకోకపోతే.. అనేక రకాల ఇన్ఫెక్షన్లు రక్తాన్ని సరఫరా చేసే నాళాల ద్వారా గుండె పొరల్లోకి చేరుకుంటాయ్. తద్వారా గుండె రక్త నాళాల్లో కొవ్వు కణాలు.. పేరుకుపోతాయ్. ఆయా కొవ్వు కణాలు గుండెకు రక్త సరఫరాను అడ్డుకోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదముంది.

అలాగే, గుండె ధమనుల్లోని ఫలకాలు విచ్చిన్నం కావడం.. అందులోని బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటికి వచ్చి.. ప్లేట్‌లెట్స్‌ని ఆకర్షించడం జరుగుతంది. తద్వారా రక్తం గడ్డ కట్టడం మొదలవుతుంది. ఇదే బ్లడ్ క్లాట్. గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాల్లోని బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల గుండె పోటు సంభవిస్తుంది.

చూశారుగా.! నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత ప్రమాదమో. ఇదే బ్రష్ చేయడానికీ గుండె పోటుకీ వున్న సంబంధం. ఆఫ్ట్రాల్ బ్రష్ చేసుకోవడమే కదా.. అని లైట్ తీసుకోవద్దు సుమా.! తస్మాత్ జాగ్రత్త.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com