యూఏఈలో ఈద్ అల్ అదాకు 6 రోజుల సెలవులు?
- February 21, 2024
యూఏఈ : పవిత్ర రమదాన్ మాసం మార్చి 12 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఒక నిపుణుడు చెప్పారు. ఉపవాస మాసం 30 రోజులు ఉంటుందని భావిస్తున్నారు. దీని ఫలితంగా ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ ఫితర్‌కు గుర్తుగా నివాసితులకు ఆరు రోజుల సెలవులు రావచ్చు. అయితే, పవిత్ర మాసం మరియు పండుగ వాస్తవ తేదీలు నెలవంక కనిపించిన సమయానికి లోబడి ఉంటాయి. సాంప్రదాయ ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్లో నెలల ప్రారంభ మరియు ముగింపు తేదీలను నిర్ణయిస్తారు. యూఏఈ లో చంద్రుని వీక్షణ కమిటీ మార్చి 10న సమావేశమవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ గుర్తించినట్లయితే, మార్చి 11 రమదాన్ మొదటి రోజు అవుతుంది. మార్చి 12 పవిత్ర మాసం ప్రారంభ తేదీ అవుతుంది.
ఈద్ అల్ ఫితర్ కోసం 6 రోజుల సెలవు?
ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం పవిత్ర మాసం 30 రోజులు ఉంటుందని నిపుణులు తెలిపారు. ఇది ఇలా ఉంటే రమదాన్ 30వ రోజు ( బుధవారం) ఏప్రిల్ 10న వస్తుంది.యూఏఈ ప్రభుత్వం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. నివాసితులు ఈద్ అల్ ఫితర్ జరుపుకోవడానికి రమదాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు సెలవులు పొందుతారు. గ్రెగోరియన్ క్యాలెండర్‌లోని సంబంధిత తేదీలు ఏప్రిల్ 9 (రమదాన్ 29-బమంగళవారం), ఏప్రిల్ 13 (షవ్వాల్ 3-శనివారం) వరకు ఉంటాయి. ఆదివారం వారాంతం నేపథ్యంలో మొత్తంగా ఆరు రోజుల పాటు సెలవులు ఉంటాయి.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







