నాని ఈ సారి ఇంకా గట్టిగా కొట్టేలా వున్నాడు.!
- February 24, 2024
‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు నేచురల్ స్టార్ నాని. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్స్ తర్వాత నాని నుంచి వస్తోన్న సినిమానే ‘సరిపోదా శనివారం’.
పేరు సూర్య, రోజు శనివారం.. అంటూ తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గట్లుగానే గ్లింప్స్ అదిరిపోయింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్‌తో అదరగొట్టేశాడు నాని.
‘అంటే సుందరానికి’ సినిమాతో ఫెయిలైన ఈ కాంబినేషన్ ఈ సారి సక్సెస్ అవ్వడం పక్కా.. అన్నట్లుగా ఫస్ట్ గ్లింప్స్ కట్ చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గ్లింప్స్ చాలా ప్రామిసింగ్‌గా వుంది. యాక్షన్ హీరోగా చాలా శక్తివంతంగా కనిపిస్తున్నాడు నాని.
ప్రియాంక మోహనన్ ఈ సినిమాతో రెండో సారి నానితో జత కడుతోంది. ‘కోపం రకరకాలు.. కానీ, ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్ధతిగా వారంలో ఒక్కరోజే వాడే వాడ్ని ఎవరైనా చూశారా.? అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడే సినిమాకి కళ కనబడిపోయింది.
విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. గ్లింప్స్ ఆఖరిలో ఆగస్ట్ 29న గ్రాండ్ రిలీజ్ అంటూ.. సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









