సీజన్ మార్పుతో పొట్ట సమస్యలా.? ఈ టిప్స్ ట్రై చేయండి.!
- February 24, 2024
సీజన్ మార్పు కారణంగా వాతావరణంలో తేమ పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. తద్వారా ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతుంటాయ్. ముఖ్యంగా పొట్ట సమస్యలు వేధిస్తుంటాయ్.
జీర్ణక్రియ తీరు సీజన్‌తో పాటూ కాస్త మార్పు చెందుతుంటుంది. శీతాకాలంలో ఒక రకంగా వుంటుంది. ఎక్కువగా డైజేషన్ సమస్యలు వేధిస్తుంటాయ్.
ఆ టైమ్‌లో వాటిని అధిగమించాలంటే, బయటి ఫుడ్‌ని పూర్తిగా అవైడ్ చేయాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి కూడా దూరంగా వుండాలి. వేడి వేడిగా వున్న ఆహారాన్ని మాత్రమే తింటుండాలి. ఫ్రిజ్‌లో వుంచి తీసిన ఆహారాన్ని తినడం తగ్గిస్తే మంచిది.
అలాగే వేసవిలోనూ బయటి ఉష్ణోగ్రతకు తగ్గట్లుగా ఆరోగ్యంలో అనేక మార్పులొస్తాయ్. వాటిని చిన్న చిన్న టిప్స్ ద్వారా ఎదుర్కోవచ్చు. జీర్ణ సమస్యలతో పాటూ, డీ హైడ్రేషన్ సమస్య వేధిస్తుంటుంది వేసవిలో.
అందుకోసం ప్రతీ రోజూ మరిగించిన వాటర్‌లో కాస్త సోంపు వేసి.. గోరువెచ్చగా తాగితే మంచి ఫలితం వుంటుంది. పరగడుపున ఈ ద్రవాన్ని తీసుకుంటే ఇంకా మంచిది.
అలాగే, పుదీనా, జీలకర్ర, దాల్చిన చెక్కలతో చేసిన గ్రీన్ టీ ఈ కాలంలో ఆరోగ్యానికి మంచిది. వీటితో పాటూ, నిమ్మరసం, కొబ్బరి బొండాలు వంటివి శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసి అనారోగ్య సమస్యల నుంచి కాపాడేందుకు సహాయ పడతాయ్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







