సీజన్ మార్పుతో పొట్ట సమస్యలా.? ఈ టిప్స్ ట్రై చేయండి.!
- February 24, 2024సీజన్ మార్పు కారణంగా వాతావరణంలో తేమ పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. తద్వారా ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతుంటాయ్. ముఖ్యంగా పొట్ట సమస్యలు వేధిస్తుంటాయ్.
జీర్ణక్రియ తీరు సీజన్‌తో పాటూ కాస్త మార్పు చెందుతుంటుంది. శీతాకాలంలో ఒక రకంగా వుంటుంది. ఎక్కువగా డైజేషన్ సమస్యలు వేధిస్తుంటాయ్.
ఆ టైమ్‌లో వాటిని అధిగమించాలంటే, బయటి ఫుడ్‌ని పూర్తిగా అవైడ్ చేయాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి కూడా దూరంగా వుండాలి. వేడి వేడిగా వున్న ఆహారాన్ని మాత్రమే తింటుండాలి. ఫ్రిజ్‌లో వుంచి తీసిన ఆహారాన్ని తినడం తగ్గిస్తే మంచిది.
అలాగే వేసవిలోనూ బయటి ఉష్ణోగ్రతకు తగ్గట్లుగా ఆరోగ్యంలో అనేక మార్పులొస్తాయ్. వాటిని చిన్న చిన్న టిప్స్ ద్వారా ఎదుర్కోవచ్చు. జీర్ణ సమస్యలతో పాటూ, డీ హైడ్రేషన్ సమస్య వేధిస్తుంటుంది వేసవిలో.
అందుకోసం ప్రతీ రోజూ మరిగించిన వాటర్‌లో కాస్త సోంపు వేసి.. గోరువెచ్చగా తాగితే మంచి ఫలితం వుంటుంది. పరగడుపున ఈ ద్రవాన్ని తీసుకుంటే ఇంకా మంచిది.
అలాగే, పుదీనా, జీలకర్ర, దాల్చిన చెక్కలతో చేసిన గ్రీన్ టీ ఈ కాలంలో ఆరోగ్యానికి మంచిది. వీటితో పాటూ, నిమ్మరసం, కొబ్బరి బొండాలు వంటివి శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసి అనారోగ్య సమస్యల నుంచి కాపాడేందుకు సహాయ పడతాయ్.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..