‘ఓం భీమ్ బుష్’ టీజర్ రిలీజ్..
- February 26, 2024
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఎంటర్టైనింగ్ స్టోరీస్ తో యూత్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంటారు. అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఆలోచింపజేసే శ్రీవిష్ణు.. తన కామెడీ టైమింగ్ ని ప్రదర్శించే సినిమాలు కూడా చేసి అందర్నీ నవ్విస్తూ ఉంటారు. అలా కడుపుబ్బా నవ్వించిన సినిమా ‘బ్రోచేవారెవరురా’. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ చిత్రం ఆడియన్స్ ని బాగా అలరించింది.
ఇప్పుడు మళ్ళీ సూపర్ హిట్ ట్రైయో మరోసారి నవ్వించడానికి.. ‘ఓం భీమ్ బుష్’ అనే ఎంటర్టైనింగ్ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేసిన మేకర్స్.. నేడు టీజర్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ టీజర్ అందరి అంచనాలకు తగ్గట్లే కామెడీతో ఆకట్టుకుంటుంది.
టీజర్ చూపించిన కథ చూస్తుంటే.. గుప్త నిధులను వెతకడం కోసం శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ సైంటిస్టులుగా ఒక గ్రామానికి వస్తారు. అక్కడ ప్రజలకి తమ సమస్యలు తీర్చడానికి వచ్చామంటూ చెప్పి.. నిధుల కోసం వేట మొదలుపెడతారు. అయితే ఆల్రెడీ అక్కడ నిధుల కోసం క్షుద్రపూజలు చేస్తూ ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ తరువాత ఏమైంది అనేది సినిమాలో చూడాల్సిందే అనుకుంట.
కాగా ఈ సినిమాని ‘హుషారు’ మూవీ ఫేమ్ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరి బ్రోచేవారెవరురా సినిమాలో ఫుల్ గా నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ ముగ్గురు.. ఈ సినిమాలో ఎంతలా నవ్విస్తారో చూడాలి.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







