శంకర్ అంటే ఆ మాత్రం వుండాలా.?
- February 27, 2024
దర్శకుల యందు శంకర్ దర్శకత్వం వేరయా అంటారు సినీ ప్రియులు. అవును కాస్త ఆలస్యమైనా అమృతం, అద్భుతాల్లాంటి సినిమాలే ఆయన నుంచి వస్తుంటాయ్. అందులో నో డౌట్.
ప్రస్తుతం ఆయన ఒక పక్క ‘ఇండియన్ 2’, మరో పక్క ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రోడ్లకి పెయింటింగులు వేయడం.. బస్సులు, లారీలను కలర్స్‌తో ముంచేయడం.. హీరో, హీరోయిన్లనే కాదు, బ్యాక్ గ్రౌండ్లో కనిపించే ఆర్టిస్టులందరినీ డిఫరెంట్ గెటప్పులతో చూపించడం ఈ తరహా హంగులు కేవలం శంకర్ సినిమాల్లోనే చూడగలం.
ఏదైనా సరే, భారీగా వుండాలి ఆయనకు. అలాంటి భారీతనం కోసం ఎంతైనా ఖర్చు పెట్టేస్తారాయన. అలాగే ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమా కోసం ఓ పెద్ద అపార్టుమెంట్ రేంజ్లో హోర్డింగులు సిద్ధం చేయిస్తున్నారట.
వీటిని సినిమా షూటింగ్‌తో పాటూ, ఆ తర్వాత ప్రమోషన్స్కీ వాడబోతున్నారట. కమల్ హాసన్ కటౌట్‌తో కూడిన ఈ భారీ హోర్డింగులకు సంబంధించి సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ వుండబోతోందట. వీటి కోసం భారీ ఖర్చు చేశారనీ తెలుస్తోంది.
విశ్వ నటుడైన కమల్ హాసన్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ శంకర్.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







