జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులకు 24x7 క్లినిక్
- February 28, 2024
అబుదాబి: అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచిత చికిత్స అందించే కొత్త అత్యాధునిక వైద్య క్లినిక్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు కుదిరిన ఒప్పందంపై అబుదాబి ఎయిర్‌పోర్ట్స్‌లో మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ ఎలెనా సోర్లిని, బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ డాక్టర్ షంషీర్ వయాలీల్ సంతకాలు చేశారు.
బుర్జీల్ హోల్డింగ్స్ యొక్క ప్రధాన సదుపాయం అయిన బుర్జీల్ మెడికల్ సిటీ (BMC) కింద ఏర్పాటు అయ్యే క్లినిక్ ప్రయాణీకులకు 24/7 అధిక-నాణ్యత వైద్య సంరక్షణను అందిస్తుంది. ఇది విమానాశ్రయం నుండి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రయాణికులకు తక్షణమే ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఆసుపత్రికి తరలించే ముందు ప్రయాణీకుల పరిస్థితులను స్థిరీకరించడానికి క్లినిక్ ఉచిత ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. ఆసుపత్రిలో చేరాల్సిన వారికి సమీపంలోని BMCలో అందుబాటులో ఉన్న క్లినిక్ లకు తరలిస్తారు. ఈ క్లినిక్ లు అబుదాబి ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు కూడా సేవలను అందిస్తుంది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!