పూరీకి హ్యాండిచ్చేసిన రౌడీ.!
- February 28, 2024
పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ‘లైగర్’ డిజాస్టర్‌తో విజయ్ దేవరకొండ కెరీరే పూర్తిగా దెబ్బ తినేసింది. అంతవరకూ విజయ్ దేవరకొండ అంటే.. ఏ రేంజ్ సెన్సేషనల్ హీరోనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కానీ, ఒక్క ‘లైగర్’ డిజాస్టర్ ఆయన కెరీర్‌నే మార్చేసింది. బొత్తిగా పట్టించుకోవడం మానేశారు. ఆ డిజాస్టర్ నుంచి తప్పించుకోవడానికి ‘ఖుషి’ సినిమా చేసినప్పటికీ కోలుకోలేకపోయాడు.
ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయ్. అందులో ఒకటి ‘ఫ్యామిలీ స్టార్’. లక్కీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే, మరో నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో మరో సినిమా కూడా విజయ్ దేవరకొండ చేతిలో వుంది. దీంతో పాటూ, తాజాగా మరో సమాచారం అందుతోంది.
‘లైగర్’ హిట్ అయితే, ‘జనగణమన’ అనే ఓ డ్రీమ్ ప్రాజెక్ట్‌ని ఇదే కాంబినేషన్లో పూర్తి చేయాలని అనుకున్నారు అటు పూరీ, ఇటు వీడీ. అయితే, ‘లైగర్’ రిజల్ట్ ఈ ప్రాజెక్ట్‌ని మధ్యలోనే వదిలిపెట్టేసేలా చేసింది.
అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, పూరీతో కాకుండా ఈ ప్రాజెక్ట్‌ని మరో డైరెక్టర్ చేతిలో పెట్టాలనుకుంటున్నాడట విజయ్ దేవరకొండ. అయితే, పూరీని డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించేసి, నిర్మాణ భాగస్వామ్యం ఇవ్వాలనుకుంటున్నాడట. మరి, ఈ ప్రచారంలో నిజమెంతో కానీ, ఇది పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అలా వదులుకుంటాడా.?
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..