రమదాన్ నెలలో భిక్షాటన చేస్తే Dh 500,000 వరకు జరిమానా, జైలుశిక్ష
- March 02, 2024
యూఏఈ: పవిత్ర మాసం దగ్గర పడుతుండటంతో మరియు నివాసితులు రమదాన్ కోసం సన్నద్ధమవుతున్నారు. దుబాయ్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఎమిరేట్‌లో భిక్షాటనకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. భిక్షాటన-వ్యతిరేక ప్రచారం ఏప్రిల్ 13నుండి ప్రారంభమవుతుంది. భిక్షాటన చేస్తూ పట్టుబడితే కనీస జరిమానా Dh 5,000 , మూడు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సయీద్ అల్ కెమ్జీ హెచ్చరించారు. విదేశాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి భిక్షాటన చేయించే వారికి కనీసం ఆరు నెలల జైలు శిక్ష, 100,000 దిర్హామ్‌లకు తగ్గకుండా జరిమానా విధించబడుతుంది. అదే విధంగా లైసెన్స్ లేకుండా నిధుల సేకరణ చేస్తే Dh250,000 -Dh500,000 వరకు జరిమానా విధిస్తారు. బిచ్చగాళ్లకు డబ్బు ఇవ్వవద్దని అధికారులు నివాసితులను కోరారు. గతేడాది 1,700 మంది యాచకులను పట్టుకుని శిక్షించామన్నారు. వీరిలో 487 మంది మహిళలు, 1,238 మంది పురుషులు ఉన్నారని కల్నల్ అల్ కెమ్జీ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …